పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు

ABN , First Publish Date - 2020-06-06T10:22:16+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్‌లో శుక్రవారం స్పందించారు. ‘‘సీఎంగా జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల నుంచి

పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు

  • బాబుపై ట్విటర్‌లో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు


అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్‌లో శుక్రవారం స్పందించారు. ‘‘సీఎంగా జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు.  గతంలో తండ్రీ కొడుకులకు సూట్‌కేసులు అందించనిదే భూ కేటాయింపులు జరిగేవికావు. ఇప్పుడా అపప్రథ తొలగిపోయింది’’ అని విజయసాయి ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో... ‘‘మాన్సాస్‌ చైర్‌పర్సన్‌ సంచిత ఆనంద గజపతి లేవనెత్తిన ఒక్క ప్రశ్నకూ జవాబు చెప్పలేకపోతున్నాడు. ట్రస్టును భ్రస్టు పట్టించాడు కాబట్టే సైలెంటైపోయాడు. దర్యాప్తులో తప్పించుకోలేడు’’ అని వ్యాఖ్యానించారు. మరో ట్వీట్‌లో ‘‘కెలికిమరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే. అధికారంలో ఉన్నన్నాళ్లూ అశోక్‌ గజపతిని ముందు పెట్టి మాన్సాస్‌ ట్రస్టును సర్వనాశనం చేశాడు. ఏ సంబంధం లేని కుటుంబరావు,  ఐవీ రావులను సభ్యులుగా నియమించినప్పుడే అర్థమైంది. దాన్ని కేకు ముక్కలా నాకేస్తాడని’’ పేర్కొన్నారు.

Updated Date - 2020-06-06T10:22:16+05:30 IST