ఇంజనీరింగ్‌ ఫీజులు ఖరారు

ABN , First Publish Date - 2020-03-25T07:53:48+05:30 IST

ఎట్టకేలకు ఇంజనీరింగ్‌ (బీటెక్‌ కోర్సులు) ట్యూషన్‌ ఫీజు ఖరారైంది. రాష్ట్రంలో మొత్తం 287 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా...

ఇంజనీరింగ్‌ ఫీజులు ఖరారు

  • గరిష్ఠంగా రూ.70వేలు.. కనిష్ఠంగా రూ.35వేలు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు ఇంజనీరింగ్‌ (బీటెక్‌ కోర్సులు) ట్యూషన్‌ ఫీజు ఖరారైంది. రాష్ట్రంలో మొత్తం 287 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా... వాటిలో 281 కాలేజీలకు ఫీజు నిర్ధారణ అయింది. 6 కాలేజీలకు గరిష్ఠంగా రూ.70వేలు ఫీజు ఖరారు కాగా.. 183 కాలేజీలకు కనిష్ఠంగా రూ.35వేల ఫీజు నిర్ణయించారు. 92 కాలేజీలకు మాత్రం రూ.35వేల నుంచి రూ.70వేల మధ్యలో ఫీజు ఖరారు చేశారు.  2019-20 విద్యా సంవత్సరానికే ఈ ఫీజులు నిర్ధారించారు. ఈ మేరకు ఉన్నతవిద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీశ్‌చంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా అనుకున్నట్లే ఫీజుల నిర్ధారణలో ప్రభుత్వం చేతివాటం ప్రదర్శించింది. తగిన ప్రాతిపదిక లేకుండానే పలు కాలేజీలకు అధిక ఫీజులు ఫిక్స్‌ చేసింది. అధికార పార్టీకి అనుబంధంగా పేరుపడ్డ వారి కాలేజీలకు పని తీరుతో సంబంధం లేకుండా వడ్డించారు.


ఇతరులను పట్టించుకోలేదు. రూ.70వేల ఫీజు నిర్ధారణ అయిన కాలేజీల జాబితాలో శ్రీవిద్యానికేతన్‌ (తిరుపతి), ఎన్‌బీకేఆర్‌ (నెల్లూరు), శ్రీవిష్ణు (భీమవరం), ఎస్‌ఆర్‌కేఆర్‌ (భీమవరం), పీవీపీ సిద్ధార్థ (విజయవాడ), జీపీఆర్‌ (కర్నూలు) ఉన్నాయి. కాగా, మిట్స్‌ (మదనపల్లె) -69,800, రఘు (విశాఖపట్నం)-69,700, లకిరెడ్డి బాలిరెడ్డి (మైలవరం)-69,700, ఆర్‌వీఆర్‌ అండ్‌ జేసీ (గుంటూరు)-69,400, రాజీవ్‌గాంధీ మెమోరియల్‌ (నంద్యాల)-69,100, గాయత్రి విద్యా పరిషత్‌ (విశాఖపట్నం) -69,000, అన్నమాచార్య (రాజంపేట)-68,700, ఎంవీజీఆర్‌ (విజయనగరం)-67,700, వీఆర్‌ సిద్ధార్ధ (విజయవాడ)-66,200, జీఎంఆర్‌ (రాజాం)-66,000, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ -65,000, ప్రగతి (పెద్దాపురం), జీవీపీ (విశాఖపట్నం), శ్రీవాసవి (తాడేపల్లిగూడెం)-63వేల చొప్పున ఫీజులు ఖరారయ్యాయి. ప్రావీణ్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెరైన్‌ ఇంజనీరింగ్‌ (విజయనగరం) కాలేజీ ఫీజును మాత్రం రూ.1.25 లక్షలుగా నిర్ణయించారు. 

Read more