ఇసుక అక్రమ రవాణాపై ఎన్ఫోర్స్‌మెంట్, పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2020-10-19T17:25:47+05:30 IST

కడప: ఏపీలో ఇసుక అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారిపోయింది.

ఇసుక అక్రమ రవాణాపై ఎన్ఫోర్స్‌మెంట్, పోలీసుల దాడులు

కడప: ఏపీలో ఇసుక అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారిపోయింది. ఏదో ఒక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. దీంతో ఎన్ఫోర్స్‌మెంట్‌తో పాటు పోలీసు అధికారులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించారు. రాజంపేటలో ఇసుక అక్రమ రవాణాపై ఎన్ఫోర్స్‌మెంట్, పోలీసు అధికారులు దాడులు చేశారు. మండల పరిధిలోని పులపత్తురులో చెయ్యరు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో అధికారులు దాడులు చేశారు. నిన్న రాత్రి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 4 ట్రాక్టర్లు,2 జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను మన్నూరు పోలీస్ స్టేషన్‌కు అధికారులు తరలించారు.

Updated Date - 2020-10-19T17:25:47+05:30 IST