ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-07-14T08:12:38+05:30 IST

ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి

ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి

  • ఏఐటీయూసీ డిమాండ్‌

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): కరోనా కల్లోల పరిస్థితుల్లోనూ  ప్రజారోగ్య పరిరక్షణకు శ్రమిస్తున్న సుమారు 42,000 మంది మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని ఏఐటీయూ సీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌ డిమాండ్‌ చేశారు. పర్మినెంట్‌ చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు వీరికి ఉన్నప్పటికీ గత, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోలేదని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. పాలకులకు కార్మికుల శ్రేయస్సు పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే కోర్టులు లేవనెత్తిన సాంకేతికపరమైన అభ్యంతరాలను తొలగించడం పెద్ద పనేమీ కాద ని పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-14T08:12:38+05:30 IST