ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ 55 % ఇవ్వాలి: ఏపీఎన్‌జీవో

ABN , First Publish Date - 2020-12-30T08:32:55+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్‌సీ కాలయాపన చేస్తున్నందున మధ్యంతర భృతి కింద 55 శాతం ఫిట్‌మెంట్‌ను వెంటనే ఇవ్వాలని ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, బండి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ 55 % ఇవ్వాలి: ఏపీఎన్‌జీవో

కడప(కలెక్టరేట్‌), డిసెంబరు 29: ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్‌సీ కాలయాపన చేస్తున్నందున మధ్యంతర భృతి కింద 55 శాతం ఫిట్‌మెంట్‌ను వెంటనే ఇవ్వాలని ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, బండి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం కడపలోని ఏపీఎన్జీవో కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విధంగా సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చే శారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలన్నారు. ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలపై విన్నవించగా సానుకూలంగా స్పందించారన్నారన్నారు. 

Updated Date - 2020-12-30T08:32:55+05:30 IST