అనంతపురం: ఉద్యోగులను వేధిస్తున్నారంటూ ఆందోళన

ABN , First Publish Date - 2020-06-22T20:57:10+05:30 IST

అనంతపురం: తమను వేధిస్తున్నారంటూ ఆర్అండ్‌బీ ఎస్ఈ కార్యాలయం ముందు ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

అనంతపురం: ఉద్యోగులను వేధిస్తున్నారంటూ ఆందోళన

అనంతపురం: తమను వేధిస్తున్నారంటూ ఆర్అండ్‌బీ ఎస్ఈ కార్యాలయం ముందు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్నా సెలవులివ్వకుండా మానసికంగా వేధిస్తున్నారని వాపోయారు. సెలవులు అడగటానికి వెళితే మహిళా ఉద్యోగులను ద్వంద్వ అర్థాలతో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా అనుమానిత లక్షణాలతో ఇద్దరు ఉద్యోగులు చనిపోయారన్నారు. కార్యాలయంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.


Updated Date - 2020-06-22T20:57:10+05:30 IST