ఉద్యోగులు జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన చేయడం కలిచివేసింది: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-08-21T03:04:53+05:30 IST

విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు 5 నెలలుగా జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన చేయడం కలిచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. 879 కుటుంబాలు ఇలా రోడ్డెక్కడం గతంలో ఏనాడైనా

ఉద్యోగులు జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన చేయడం కలిచివేసింది: చంద్రబాబు

అమరావతి: విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు 5 నెలలుగా జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన చేయడం కలిచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. 879 కుటుంబాలు ఇలా రోడ్డెక్కడం గతంలో ఏనాడైనా చూశామా? అని ప్రశ్నించారు. ఇప్పుడెందుకిలా ట్రస్ట్‌కు అప్రదిష్ట తెచ్చారని నిలదీశారు. ఎంతో ఆర్ధిక పరిపుష్టి ఉన్న మాన్సాస్ సంస్థ ఇప్పుడిలా కావడానికి కారణం ఎవరు? అని మరోసారి ప్రశ్నించారు. సజావుగా అందుతున్న సంస్థ సేవలను గాడి తప్పించింది ఇందుకేనా అని నిలదీశారు. ఇలాంటి దుస్థితి ఎదురు కాకూడదనే రాజా పీవీజీరాజు వేలాది ఎకరాల భూములతో... వందల కోట్ల నగదు ఫిక్సిడ్ డిపాజిట్లతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసారన్నారు. అటువంటి సంస్థ ఇప్పుడిలా దిగజారడం చూస్తే ఎవరికైనా ఆత్మ క్షోభించక తప్పదని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2020-08-21T03:04:53+05:30 IST