-
-
Home » Andhra Pradesh » Emcet Ecet Applications online
-
ఏపీలో ఎంసెట్, ఈ సెట్, ఐసెట్ దరఖాస్తుల గడువు పెంపు
ABN , First Publish Date - 2020-03-24T23:18:02+05:30 IST
ఎంసెట్, ఈ సెట్, ఐసెట్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఎంసెట్‌కు ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవ్చని...

అమరావతి: ఎంసెట్, ఈసెట్, ఐసెట్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఎంసెట్‌కు ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ సెట్, ఐసెట్‌కు ఏప్రిల్ 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయాలని సూచించారు. లాక్‌డౌన్ కారణంగా టెన్త్ పరీక్షల్ని వాయిదా వేశామన్నారు. టెన్త్ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. లాక్‌డౌన్ నిబంధనల్ని అతిక్రమించిన వారిపై 330 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అత్యవసర సేవలన్నీ అందుబాటులో ఉంటాయని, నిత్యావసరాల ధరల్ని కలెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రకటించాలన్నారు. మార్చి 29న ప్రజలకు రేషన్ అందజేస్తామని, తెల్లరేషన్ కార్డు దారులకు ఏప్రిల్ 4న రూ. వెయ్యి ఇస్తామని పేర్నినాని స్పష్టం చేశారు.