-
-
Home » Andhra Pradesh » Eluru Hospital One person died
-
ఏలూరులో మూర్చతో ఒకరు మృతి
ABN , First Publish Date - 2020-12-07T01:43:40+05:30 IST
ఏలూరు ఆస్పత్రిలో మూర్చ వ్యాధితో ఒకరు మృతిచెందారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు భయాందోళనకు గురవుతున్నారు.

ప.గో: ఏలూరులో అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతిచెందారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఏలూరు విద్యానగర్‌కు చెందిన శ్రీధర్ (45) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అతను ఉదయం మూర్చ లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. సరైన వైద్యం అందకనే మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇతర అనారోగ్య సమస్యల కారణంగానే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో మిగతా రోగుల పరిస్థితిపై వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.