-
-
Home » Andhra Pradesh » Eluru Hospital Health Commissioner Katamneni Bhaskar
-
ఏలూరులో పరిస్థితిపై భయపడోద్దు : కాటంనేని భాస్కర్
ABN , First Publish Date - 2020-12-06T21:43:02+05:30 IST
ఏలూరు ఆస్పత్రిలో మూర్చవ్యాధితో బాధపడుతున్న రోగులను ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ పరామర్శించారు.

ప.గో: ఏలూరు ఆస్పత్రిలో మూర్చవ్యాధితో బాధపడుతున్న రోగులను ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏలూరులో పరిస్థితిపై భయపడాల్సిన పనిలేదని తెలిపారు. ఇప్పటివరకు చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి కారణాలు బయటపడలేదని.. వైరస్, బ్యాక్టీరియా రోగాలకు సంబంధించి నెగిటివ్ వచ్చిందని చెప్పారు. తాగునీరు కలుషితం కాలేదని ప్రజలు ఆందోళన పడవద్దని అన్నారు. రోగులకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని.. కల్చర్ టెస్ట్‌కు సంబంధించిన నివేదిక రేపు వస్తుందని తెలిపారు.