ఏలూరులో కలకలం.. అంతు చిక్కని వ్యాధి సోకి..
ABN , First Publish Date - 2020-12-06T04:00:21+05:30 IST
ఏలూరులో కలకలం రేగింది. కొబ్బరితోట, పడమర వీధి, దక్షిణవీధిలో పలువురికి అంతు చిక్కని వ్యాధి సోకింది...

ప.గో: ఏలూరులో కలకలం రేగింది. కొబ్బరితోట, పడమర వీధి, దక్షిణవీధిలో పలువురికి అంతు చిక్కని వ్యాధి సోకింది. పలువురు స్థానికులు నురగలు కక్కుతూ కళ్లు తిరిగి పడిపోయారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 48 మందికి చికిత్స అందిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మరికొంత మందికి చికిత్స కొనసాగుతోంది. మూర్చ కేసులపై మంత్రి ఆళ్లనాని స్పందించారు. ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటి సర్వే చేయాలని ఆదేశించారు. వ్యాధి లక్షణాలపై ఉన్నతాధికారుల దృష్టి సారించారు.