7న ఈ-లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2020-10-24T08:55:01+05:30 IST

రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌లో వున్న మోటారు వాహన ప్రమాద కేసులు, ఎన్‌ఐ యాక్ట్‌ కేసులు తదితరాల సత్వర పరిష్కారం కోసం నవంబరు 7న

7న ఈ-లోక్‌ అదాలత్‌

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌లో వున్న మోటారు వాహన ప్రమాద కేసులు, ఎన్‌ఐ యాక్ట్‌ కేసులు తదితరాల సత్వర పరిష్కారం కోసం నవంబరు 7న ‘ఈ - లోక్‌ అదాలత్‌’ జరుగనుంది. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలో జరుగనున్న ఈ లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.


దీనిలో పాల్గొనదలచిన కక్షిదారులు, న్యాయవాదులు తమ కేసు వివరాలను హైకోర్టు మెయిల్‌ ఐడీకి పంపాల్సి వుంటుంది. ఈ లోక్‌ అదాలత్‌కు బీమా కంపెనీల ద్వారా ప్రతిపాదించిన కేసుల వివరాలు మూడు రోజుల ముందుగా హైకోర్టు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. న్యాయవాదులు, కక్షిదారులు 7న హైకోర్టు వెబ్‌సైట్‌లో ఇవ్వబడిన లింక్‌ ద్వారా హాజరై కేసులను పరిష్కరించుకోవచ్చు. కక్షిదారులు, న్యాయవాదులు వివరాలు పంపాల్సిన ఈ మెయిల్‌ ఐడీ:aphclsc@gmail.comUpdated Date - 2020-10-24T08:55:01+05:30 IST