ఆంధ్రా నుంచి ఒడిశాలోకి ఏనుగులు

ABN , First Publish Date - 2020-12-30T08:23:07+05:30 IST

రెండు రోజులుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో స్వైరవిహారం చేసిన ఏనుగులు ఒడిశాలోని సుర్లా ప్రాంతంలో అలజడి సృష్టిస్తున్నాయి.

ఆంధ్రా నుంచి ఒడిశాలోకి ఏనుగులు

ఇచ్ఛాపురం , డిసెంబరు 29 : రెండు రోజులుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో స్వైరవిహారం చేసిన ఏనుగులు  ఒడిశాలోని సుర్లా ప్రాంతంలో అలజడి సృష్టిస్తున్నాయి.  ఆంధ్రాలోని బాలకృష్ణాపురం, డొంకూరు మీదుగా ఒడిశా సుర్ల గ్రామానికి సముద్రతీరం గుండా మంగళవారం నాటికి ఇవి చేరుకున్నాయి. చుట్టుపక్కల తోటలు, పొలాల్లోకి వెళ్లి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అటవీశాఖ అధికారులు ఆ గుంపులో సుమారు 25నుంచి 30వరకు ఏనుగులు ఉన్నట్లు అంచనా వేశారు. కాగా,  ఏనుగు పిల్లలను చూసిన సుర్ల గ్రామ యువకులు వాటిని పట్టుకుని సేద తీర్చారు. 

Updated Date - 2020-12-30T08:23:07+05:30 IST