చిత్తూరులో ఏనుగుల గుంపు బీభత్సం
ABN , First Publish Date - 2020-12-19T16:07:00+05:30 IST
రామకుప్పం మండలం ననియల అటవీప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి.
చిత్తూరు: రామకుప్పం మండలం ననియల అటవీప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరి, రాగి, అరటి పంటలను తొక్కి, తిని ఏనుగులు నాశనం చేశాయి. జిల్లాలో ఏనుగుల సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఏనుగులను తరమడానికి ప్రయత్నిస్తున్నారు. రోజురోజుకూ ఏనుగుల గుంపు దాడులు ఎక్కువవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.