చిత్తూరు జిల్లాలో గజరాజుల హల్‌చల్

ABN , First Publish Date - 2020-12-11T16:47:30+05:30 IST

శాంతిపురం మండలంలో గజరాజులు హడలెత్తిస్తున్నాయి.

చిత్తూరు జిల్లాలో గజరాజుల హల్‌చల్

చిత్తూరు జిల్లా: శాంతిపురం మండలంలో గజరాజులు హడలెత్తిస్తున్నాయి. పంట పొలాలపై దాడి చేస్తూ.. రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. కోనేరుకుప్పం, గొల్లపల్లి, వెంకేపల్లి, కృష్ణాపురం గ్రామాల్లో ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ఏనుగులను కర్ణాటక అటవీశాఖ అధికారులు తరమడంతో ఏపీ వైపు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. గజరాజులను తిరిగి అడవుల్లోకి పంపేందుకు స్థానిక అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2020-12-11T16:47:30+05:30 IST