లాక్‌డౌన్‌ విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయండి: కేశినేని

ABN , First Publish Date - 2020-05-10T10:15:58+05:30 IST

‘‘లాక్‌డౌన్‌ కాలానికి కరెంటు బిల్లులు మాఫీ చేయాలనేది ప్రజల కోరిక. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని కోరారు.

లాక్‌డౌన్‌ విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయండి: కేశినేని

విజయవాడ, మే 9(ఆంధ్రజ్యోతి): ‘‘లాక్‌డౌన్‌ కాలానికి కరెంటు బిల్లులు మాఫీ చేయాలనేది ప్రజల కోరిక. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని కోరారు. విద్యుత్‌ బిల్లులపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పోస్టులపై ఆయన శనివారం ట్విటర్‌లో స్పందించారు. ‘‘విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ అయిన ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీని మూసివేయాలని స్థానికులు డి మాండ్‌ చేస్తున్నారు. మనకేమీ ప్రత్యేక ఆసక్తులు లేనప్పుడు ఆ కంపెనీని మూసివేయటానికి ఇబ్బందేమిటి ముఖ్యమంత్రి గారూ?’’ అని మరో ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-05-10T10:15:58+05:30 IST