కాకినాడలో ఎలక్ట్రిక్‌ లోకో తయారీ యూనిట్‌

ABN , First Publish Date - 2020-03-13T09:48:47+05:30 IST

కాకినాడలో ఎలక్ట్రిక్‌ లోకో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని వైసీపీ ఎంపీ వంగా గీత కోరారు. కాకినాడలో సెజ్‌తో పాటు పోర్టు కూడా ఉందని, ఈ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తే...

కాకినాడలో ఎలక్ట్రిక్‌ లోకో తయారీ యూనిట్‌

  • లోక్‌సభలో వంగా గీత విజ్ఞప్తి


న్యూఢిల్లీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడలో ఎలక్ట్రిక్‌ లోకో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని వైసీపీ ఎంపీ వంగా గీత కోరారు. కాకినాడలో సెజ్‌తో పాటు పోర్టు కూడా ఉందని, ఈ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. గురువారం లోక్‌సభలో రైల్వే శాఖ పద్దులపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. రైతుల అభివృద్ధి కోసం ఏపీకి  కిసాన్‌ రైలును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.


పిఠాపురం-కాకినాడ రైల్వే లైన్‌ పనులు తిరిగి ప్రారంభించాలని, ఈ ప్రాజెక్టు సాధ్యం కాదని అంటున్నారని, కానీ ప్రజల కోణంలో ఆలోచించాలని సూచించారు. కాగా, సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ను ప్రకటించి ఏడాది గడుస్తున్నా పనులు ఇంకా ప్రారంభం కాలేదని, ఈ ప్రాజెక్టుకు కేవలం రూ. లక్ష మాత్రమే కేటాయించారని తెలిపారు. సరిపడా కేటాయింపులు చేసి అతి త్వరలో పూర్తి చేయాలని కోరారు.  

Updated Date - 2020-03-13T09:48:47+05:30 IST