గుర్తులు రివర్స్‌

ABN , First Publish Date - 2020-03-15T08:42:14+05:30 IST

తూర్పుగోదావరి జిల్లాపరిషత్‌ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. శనివారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావడంతో...

గుర్తులు రివర్స్‌

  • టీడీపీ అభ్యర్థికి ఫ్యాన్‌, వైసీపీ అభ్యర్థికి సైకిల్‌

తూర్పుగోదావరి జిల్లాపరిషత్‌ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. శనివారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావడంతో ఎంపీటీసీ అభ్యర్థులకు గుర్తులు కేటాయించాల్సి ఉంది. దీనినే బ్యాలెట్‌ పేపర్‌ అంటారు. రిటర్నింగ్‌ అధికారి సంతకంతో వచ్చే దీని ఆధారంగా బ్యాలెట్‌ పత్రాల ప్రింటింగ్‌ జరుగుతుంది. కానీ తుని మండలం రేఖవానిపాలెం ఎంపీటీసీ సభ్యులకు ఇచ్చే గుర్తుల కేటాయింపులో వైసీపీ అభ్యర్థి డబ్బూరి నాగశివకి సైకిలు, టీడీపీ అభ్యర్థి నడిగట్ల సూర్యనారాయణకు ఫ్యాను గుర్తు కేటాయించారు. ఈ తప్పులతోనే శనివారం రాత్రి రిటర్నింగ్‌ ఆఫీసర్‌ సంతకంలో ఫారం9 బ్యాలెట్‌ పేపర్‌ను జారీచేశారు. 

- ఆంధ్రజ్యోతి, కాకినాడ

Updated Date - 2020-03-15T08:42:14+05:30 IST