సూపర్‌వైజర్లకు 350, లెక్కించేవారికి 250

ABN , First Publish Date - 2020-03-18T09:02:52+05:30 IST

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన భత్యాన్ని ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్‌కృష్ణ ద్వివేది మంగళవారం ఉత్తర్వులిచ్చారు.

సూపర్‌వైజర్లకు 350, లెక్కించేవారికి 250

  • స్థానిక ఎన్నికల సిబ్బందికి రెమ్యూనరేషన్‌ ఖరారు

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన భత్యాన్ని ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్‌కృష్ణ ద్వివేది మంగళవారం ఉత్తర్వులిచ్చారు. భారత ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయించిన రెమ్యూనరేషన్‌ ప్రకారం దీనిని వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. జోనల్‌, రూట్‌, సెక్టోరల్‌ ఆఫీసర్లకు ఏకమొత్తంగా రూ.1500, ప్రిసైడింగ్‌ అధికారి, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లకు రోజుకు రూ.350, పోలింగ్‌ ఆఫీసర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లకు రోజుకు రూ.250, ఆఫీస్‌ సబార్డినేట్లకు రూ.150, పోలింగ్‌ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని ఉద్యోగులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం నిమిత్తం రోజుకు రూ.150 చొప్పున చెల్లించనున్నట్టు పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-18T09:02:52+05:30 IST