నేడు గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2020-03-15T08:32:15+05:30 IST

గ్రామ పంచాయతీల ఎన్నికలకు ఆదివారంనాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను...

నేడు గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌

అమరావతి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల ఎన్నికలకు ఆదివారంనాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. 15న మొదటి విడత, 17న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 13,368 గ్రామ పంచాయతీలుంటే.. 120 గ్రామ పంచాయతీల విభజన, విలీన ప్రక్రియపై హైకోర్టు స్టే ఇవ్వడంతో మిగిలిన 13,248 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Updated Date - 2020-03-15T08:32:15+05:30 IST