-
-
Home » Andhra Pradesh » Election Commission chandrababu Tenali
-
ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ
ABN , First Publish Date - 2020-03-13T21:53:24+05:30 IST
తెనాలిలో టీడీపీ అభ్యర్థి ఇంట్లో దుండగులు.. అక్రమంగా మద్యం పెట్టారని ఎన్నికల సంఘానికి ఆ పార్టీ అగ్రనేత చంద్రబాబు లేఖ రాశారు. ఎక్సైజ్ పోలీసులు నేరుగా వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి మద్యం తీశారని

అమరావతి: తెనాలిలో టీడీపీ అభ్యర్థి ఇంట్లో దుండగులు.. అక్రమంగా మద్యం పెట్టారని ఎన్నికల సంఘానికి ఆ పార్టీ అగ్రనేత చంద్రబాబు లేఖ రాశారు. ఎక్సైజ్ పోలీసులు నేరుగా వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి మద్యం తీశారని, మద్యాన్ని దుండగులు పెట్టిన దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయని ఆయన తెలిపారు. తన నివాసంలో అక్రమంగా మద్యం పెట్టారని, వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు, పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మాచర్ల, ధర్మవరంలో నామినేషన్ పత్రాలు చించివేయటంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి చంద్రబాబు మరో లేఖ రాశారు.