కోడ్‌.. 46 లక్షలు స్వాధీనం

ABN , First Publish Date - 2020-03-13T09:16:02+05:30 IST

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రూ.46.79 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం కృష్ణా జిల్లా కంచికచర్ల సమీప కీసర టోల్‌గేట్‌ వద్ద వాహనాలను తనిఖీ...

కోడ్‌.. 46 లక్షలు స్వాధీనం

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రూ.46.79 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం కృష్ణా జిల్లా కంచికచర్ల సమీప కీసర టోల్‌గేట్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జగ్గయ్యపేట నుంచి ఆర్టీసీ బస్సులో విజయవాడ వెళుతున్న జగ్గయ్యపేటకు చెందిన కోట కృష్ణ  బ్యాగులో రూ.45,54,570 లక్షలు గుర్తించారు. ఈ నగదుకు ఏలాంటి ఆధారాలూ లేకపోవడంతో స్వాధీనం చేసుకొని, రిటర్నింగ్‌ అధికారికి అప్పగించనున్నట్టు సీఐ చెప్పారు. అలాగే, నందిగామ మండలం కొణతమాత్మకూరు చెక్‌పోస్టు వద్ద రూ.1.79 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. అదే గ్రామానికి చెందిన అప్పారావు గంపలగూడెం మండలం పెనుగొలను నుంచి ఆ నగదు తీసుకొస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. 

- కంచికచర్ల 


Updated Date - 2020-03-13T09:16:02+05:30 IST