రేపే రంజాన్‌ పండుగ

ABN , First Publish Date - 2020-05-24T08:38:29+05:30 IST

పవిత్ర రంజాన్‌ ఉపవాస దీక్షలు ఆదివారంతో ముగియనున్నాయి. దేశవ్యాప్తంగా ఈద్‌-ఉల్‌ ఫితర్‌(రంజాన్‌ పండుగ)ను సోమవారం జరుపుకోనున్నారు.

రేపే రంజాన్‌ పండుగ

అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): పవిత్ర రంజాన్‌ ఉపవాస దీక్షలు ఆదివారంతో ముగియనున్నాయి. దేశవ్యాప్తంగా ఈద్‌-ఉల్‌ ఫితర్‌(రంజాన్‌ పండుగ)ను సోమవారం జరుపుకోనున్నారు. 30 రోజుల రంజాన్‌ ఉపవాస దీక్షలు ఏప్రిల్‌ 25న ప్రారంభమయ్యాయి. ఏటా రంజాన్‌, బక్రీద్‌ పండుగ ప్రార్థనలు ఈద్గాల వద్ద జరిగేవి. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ దఫా ఇళ్లల్లోనే రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాలని ముస్లిం మత పెద్దలు విజ్ఞప్తి చేశారు. సౌదీ ఆరేబియాతో పాటు దుబాయ్‌, కువైత్‌ తదితర దేశాల్లో రంజాన్‌ పండుగ ఆదివారం జరగనుంది. 

Updated Date - 2020-05-24T08:38:29+05:30 IST