తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన సూర్యగ్రహణం ఘడియలు

ABN , First Publish Date - 2020-06-21T20:28:28+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం ఘడియలు ముగిశాయి. తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను అర్చకులు తెరిచారు. శ్రీవారి ఆలయంలో శుద్ధి, పుణ్యవహచనం, శ్రీవారికి ఏకాంతంగా పూజ కైంకర్యాల సమర్పించారు.

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన సూర్యగ్రహణం ఘడియలు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం ఘడియలు ముగిశాయి. తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను అర్చకులు తెరిచారు. శ్రీవారి ఆలయంలో శుద్ధి, పుణ్యవహచనం, శ్రీవారికి ఏకాంతంగా పూజ కైంకర్యాల సమర్పించారు. సోమవారం ఉదయం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. సూర్యగ్రహణం విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 నుంచి మధ్యాహ్నం 3.04 వరకు ఉంటుందని వేద పండితులు తెలిపారు. దేశంలో మొదటగా గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో గ్రహణ దర్శనం ఉంటుంది. తెలంగాణలో ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 1.44 వరకు గ్రహణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు సూర్యగ్రహం ఉంటుందని వేద పండితులు తెలిపారు.

Updated Date - 2020-06-21T20:28:28+05:30 IST