తూర్పుగోదావరి జిల్లాలో 26కు చేరిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-04-21T16:29:34+05:30 IST
తూర్పుగోదావరి జిల్లాలో 26కు చేరిన కరోనా కేసులు

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాటిటివ్ కేసుల సంఖ్య 26కు చేరింది. దాదాపు 18 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం నుంచి వరుసగా ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజమండ్రిలో కొత్తగా మూడు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి వైద్య చర్యలు చేపట్టారు. ప్రతి కంటైన్మెంట్ జోన్‌కు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిత్యావసరాలు సరఫరా చేసేందుకు రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేశారు.
రాజమండ్రిలో కరోనా సోకిన మహిళకు రహస్యంగా వైద్యం అందించిన ఆర్ఎంపీ డాక్టర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆర్ఎంపీ డాక్టర్ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు జిల్లాకు వచ్చిన 7,423 రాపిడ్ టెస్ట్ కిట్లు ద్వారా నేటి నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు.