ఒక్క జిల్లా... 41 తక్కువగా అక్షరాల లక్ష కరోనా కేసులు!

ABN , First Publish Date - 2020-10-04T11:45:38+05:30 IST

రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లా ఇప్పటికే కొవిడ్‌ బాధితుల నమోదులో ప్రథమ స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 824 మందికి వైరస్‌ సోకింది. దీంతో జిల్లాలో 99,959 కేసులుగా

ఒక్క జిల్లా... 41 తక్కువగా అక్షరాల లక్ష కరోనా కేసులు!

కాకినాడ : రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లా ఇప్పటికే కొవిడ్‌ బాధితుల నమోదులో ప్రథమ స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 824 మందికి వైరస్‌ సోకింది. దీంతో జిల్లాలో 99,959 కేసులుగా నమోద య్యాయి. ఇంకా 41 కేసులు ఇప్పుడున్న సంఖ్యకు జత కలి స్తే జిల్లాలో అక్షరాలా లక్ష కేసుల మైలురాయిని చేరతాయి. ఎట్టి పరిస్థితిలో లక్షకు దాటకుండా చూడాలనే అధికారులు, వైద్యుల ప్రయత్నాలకు దీంతో బ్రేక్‌ పడినట్టే. వాస్తవానికి ఇప్పుడు వెలువడిన ఫలితాలు ఈనెల 2వ తేదీ నాటివి. మూడో తేదీ ఫలితాలు వచ్చినప్పటికీ ఈనెల 4న ప్రకటించ నందున కేసులు లక్ష దాటిపోయినట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈ వివరాలను ప్రకటించాల్సి ఉంది. కొత్తగా జిల్లాలో ఐదుగురు కొవిడ్‌తో మృతి చెందారు. దీంతో 537 మరణాలు నమోదయ్యాయి. యాక్టివ్‌గా 9,243 మంది, 90,179 మంది ప్రస్తుతం కోలుకున్నారు. కాగా గత నాలుగైదు రోజుల నుంచి కొవిడ్‌ బాధితుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టింది. దీనిపై కొంత గందరగోళం ఉంది. పరీక్షల సంఖ్య తగ్గించడమే కారణమనే వాదన వినిపిస్తోంది.

Updated Date - 2020-10-04T11:45:38+05:30 IST