‘ఈ-సంజీవని’కి పెరుగుతున్న ఆదరణ
ABN , First Publish Date - 2020-12-15T09:59:07+05:30 IST
కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ ప్రవేశపెట్టిన ‘ఈ-సంజీవని‘ టెలీమెడిసిన్ సేవల పథకానికి ప్రజాదరణ పెరుగుతోంది.
అగ్రభాగాన తమిళనాడు, ఏడో స్థానంలో ఏపీ
న్యూఢిల్లీ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ ప్రవేశపెట్టిన ‘ఈ-సంజీవని‘ టెలీమెడిసిన్ సేవల పథకానికి ప్రజాదరణ పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ పథకం కింద పది లక్షల టెలీ సంప్రదింపులు (టెలీ-కన్సల్టెన్సీ) జరిగినట్టు ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. దేశంలోని 550కి పైగా జిల్లాల్లో రోగులు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. రోజుకు 14వేల టెలీ సంప్రదింపులు జరుగుతున్నట్లు ఆ శాఖ పేర్కొంది. ఈ సేవలు అందుకోవడంలో ఆంధ్రప్రదేశ్ 39,853 మందితో ఏడో స్థానంలో, తెలంగాణ 412(ఓపీడీ)తో 20వ స్థానంలో ఉన్నాయి. తమిళనాడు 3,19,507తో ప్రథమ స్థానంలో, ఉత్తరప్రదేశ్ 2,68,889తో ద్వితీయ స్థానంలో ఉన్నాయి.