ఏపీ ఈసెట్‌ నేడే

ABN , First Publish Date - 2020-09-14T11:58:45+05:30 IST

ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీ ఈసెట్‌-2020) సోమవారం జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి విడత, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ...

ఏపీ ఈసెట్‌ నేడే

అమరావతి: ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీ ఈసెట్‌-2020) సోమవారం జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి విడత, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో విడత పరీక్ష నిర్వహిస్తారు. 78 సెంటర్లలో పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 37,167 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-09-14T11:58:45+05:30 IST