-
-
Home » Andhra Pradesh » during eclipse
-
రోకలి నిలబడింది!
ABN , First Publish Date - 2020-06-22T09:00:52+05:30 IST
గ్రహణం సమయంలో రోట్లో రోకలి నిలబడుతుందన్నది నానుడి. దీన్ని పలువురు రుజువు చేశారు!. ఆదివారం సూర్యగ్రహణం సందర్భంగా

ఒంగోలు కల్చరల్, సూళ్లూరుపేట: గ్రహణం సమయంలో రోట్లో రోకలి నిలబడుతుందన్నది నానుడి. దీన్ని పలువురు రుజువు చేశారు!. ఆదివారం సూర్యగ్రహణం సందర్భంగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని గవండ్లవీధికి చెందిన వెంకటేశ్వర్లు తమ ఇంటి వాకిట ఈ ప్రయోగం చేశారు. సూర్యగ్రహణం ప్రారంభమైన 10.30 గంటలకు ఓ పళ్లెంలో నీళ్లు పోసి రోకలిబండను నిలబెట్టగా మధ్యాహ్నం 1.45 గంటల వరకు అలానే నిలబడి పోయింది. గ్రహణం వీడిన వెంటనే అది పడిపోయింది.
అలాగే, ప్రకాశం జిల్లా ఒంగోలులోని పేర్నమిట్టలో వేణు, శ్రీదేవి దంపతులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రోట్లో రోకలిని నిలబెట్టారు. అయితే మూడు నిమిషాలపాటు ఎలాంటి ఆసరా లేకుండా నిలబడింది. అయితే రోకలిబండ అడుగు భాగం చదునుగా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో అలా నిలబడతాయని, ఇందులో పెద్ద ఆశ్చర్యంగానీ, శాస్ర్తీయత గానీ లేదని పలువురు చెబుతున్నారు.