21న దుర్గమ్మ ఆలయం మూసివేత
ABN , First Publish Date - 2020-06-18T22:42:59+05:30 IST
ఈ నెల 21న గ్రహణం కారణంగా దుర్గమ్మ ఆలయం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 20న సాయంత్రం దుర్గమ్మకు పంచ హారతులు అనంతరం అమ్మవారి ఆలయం మూసివేస్తారు.

విజయవాడ: ఈ నెల 21న గ్రహణం కారణంగా దుర్గమ్మ ఆలయం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 20న సాయంత్రం దుర్గమ్మకు పంచ హారతులు అనంతరం అమ్మవారి ఆలయం మూసివేస్తారు. 21న ఉదయం 10:25 గంటలకు గ్రహణం ప్రారంభమని, మధ్యాహ్నం 1:45 గంటలకు గ్రహణం విడుస్తుందని పండితులు చెబుతున్నారు. గ్రహణం వీడిన అనంతరం ఆలయాన్ని సిబ్బంది శుభ్రపరుస్తారు. అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 22న ఉదయం 6 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.