-
-
Home » Andhra Pradesh » Durgamma darshan from today morning
-
నేటి ఉదయం నుంచి దుర్గమ్మ దర్శనం
ABN , First Publish Date - 2020-06-22T09:19:32+05:30 IST
నేటి ఉదయం నుంచి దుర్గమ్మ దర్శనం

విజయవాడ, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): సూర్యగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం మూసివేసిన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ తలుపులు గ్రహణానంతరం ఆదివారం మధ్యాహ్నం తెరుచుకున్నాయి. ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత వేదపండితులు అమ్మవారి ఆలయంతోపాటు ఉపాలయాల్లోని దేవతామూర్తులకు స్నపనాది కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మళ్లీ మూసివేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.