సరస్వతీదేవిగా దుర్గమ్మ

ABN , First Publish Date - 2020-10-22T09:12:53+05:30 IST

సరస్వతీదేవిగా దుర్గమ్మ

సరస్వతీదేవిగా దుర్గమ్మ

విజయవాడ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ ఐదో రోజు  సరస్వతీదేవి గా భక్తులకు దర్శనమిచ్చారు. త్రిశక్తి స్వరూపంతో, ధవళ వర్ణాలతో ప్రకాశి స్తూ బంగారు వీణ, దండ, కమండ లాలను ధరించి అభయముద్రతో భక్తులను కటాక్షించారు. బుధవారం అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో భక్తులను తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనానికి అనుమతించారు. ఉదయం తక్కువ గానే ఉన్న భక్తులు సాయంత్రానికి భారీగా తరలివచ్చారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌, ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అమ్మవారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2020-10-22T09:12:53+05:30 IST