బాలాత్రిపురసుందరిగా దుర్గమ్మ

ABN , First Publish Date - 2020-10-19T07:07:36+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ రెండోరోజు ఆదివారం బాలాత్రిపురసుందరీ దేవిగా దర్శనమిచ్చారు.

బాలాత్రిపురసుందరిగా దుర్గమ్మ

విజయవాడ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ రెండోరోజు ఆదివారం బాలాత్రిపురసుందరీ దేవిగా దర్శనమిచ్చారు. తెల్లజామున 3గంటల నుంచి వేదపండితులు అమ్మవారికి సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలు, నిత్యార్చనలు, నివేదనలు సమర్పించారు

అనంతరం అమ్మవారికి ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులతో కూడిన వస్త్రధారణతో బాలాత్రిపుసుందరీ దేవిగా అలంకరించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. దివ్యమంగళ రూపంలో అభయహస్త ముద్రతో అమ్మవారు భక్తులను కటాక్షించారు.


Updated Date - 2020-10-19T07:07:36+05:30 IST