అమ్మవారి విగ్రహాన్ని తొలగించిన పోలీసులు

ABN , First Publish Date - 2020-10-19T17:38:21+05:30 IST

కృష్ణా జిల్లా లక్ష్మీపురం గ్రామంలో పోలీసులు రెచ్చిపోయారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని పోలీసులు దౌర్జన్యంగా తొలగించారు. అప్పటికే రెండు రోజులుగా అమ్మవారికి గ్రామస్తులు పూజలు నిర్వహించారు. నేడు మండపం వద్దకు వచ్చిన పోలీసులు కోవిడ్

అమ్మవారి విగ్రహాన్ని తొలగించిన పోలీసులు

విజయవాడ: కృష్ణా జిల్లా లక్ష్మీపురం గ్రామంలో పోలీసులు రెచ్చిపోయారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని పోలీసులు దౌర్జన్యంగా తొలగించారు. అప్పటికే రెండు రోజులుగా అమ్మవారికి గ్రామస్తులు పూజలు నిర్వహించారు. నేడు మండపం వద్దకు వచ్చిన పోలీసులు కోవిడ్ నిబంధనలు, ఆంక్షలు అంటూ, పందిళ్ల ఏర్పాటుకు అనుమతి లేదంటూ అమ్మవారి విగ్రహాన్ని తొలగించారు. అయితే పోలీసులపై చర్యపై గ్రామస్తులు, అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న శివ స్వామిజీ, వీహెచ్‌పీ సభ్యులు లక్ష్మీపురానికి వెళ్లారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్రంలో హిందూ పండుగలపై, హిందువులపై అరాచకాలు పెరిగిపోతున్నాయని శివ స్వామిజీ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అసలు రాష్ట్రంలో హిందువులు ఉండాలా? వెళ్లిపోవాలా? అని నిప్పులు చెరిగారు. 

Updated Date - 2020-10-19T17:38:21+05:30 IST