అనంతపురం సబ్ డివిజన్‌లో పోలీస్ యాక్ట్ 30 అమలు: డీఎస్పీ

ABN , First Publish Date - 2020-10-31T19:49:41+05:30 IST

అనంతపురం: సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ యాక్ట్ 30 అమలు చేసినట్టు అనంతపురం డీఎస్పీ తెలిపారు.

అనంతపురం సబ్ డివిజన్‌లో పోలీస్ యాక్ట్ 30 అమలు: డీఎస్పీ

అనంతపురం: సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ యాక్ట్ 30 అమలు చేసినట్టు అనంతపురం డీఎస్పీ తెలిపారు. రేపటి నుంచి వచ్చే నెల 30 వరకు పోలీస్ యాక్టు అమల్లో ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించదలిస్తే.. 48 గంటలు ముందుగా అనుమతి తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. అనుమతి లేకుండా నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. 

Read more