వైసీపీ కార్యాలయంలో ద్రోణంరాజు శ్రీనివాసరావు సంతాప సభ
ABN , First Publish Date - 2020-10-05T01:13:32+05:30 IST
వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాసరావు సంతాప సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విశాఖ: వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాసరావు సంతాప సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ద్రోణంరాజు పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని వెళ్లే మనిషని కొనియాడారు. ద్రోణంరాజు కుటుంబ సభ్యులకు అవంతి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ద్రోణంరాజుతో మంచి అనుబంధం ఉందని, ఒక మంచి మనిషిని కోల్పాయామని ఎమ్మెల్యే గూడివాడ అమర్నాథ్ చెప్పారు.
ఆదివారం ద్రోణంరాజు శ్రీనివాసరావు కన్నుమూశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం ఆయన కరోనా బారినపడ్డారు. అయితే దాన్నుంచి కోలుకున్నా.. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. విశాఖ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ద్రోణంరాజు గెలిచారు. ప్రస్తుతం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) చైర్మన్‌గా ద్రోణంరాజు ఉన్నారు.