ఏలూరులో వింత వ్యాధికి తాగునీరే కారణం

ABN , First Publish Date - 2020-12-11T14:15:11+05:30 IST

ఏలూరులో వింత వ్యాధికి తాగునీరే కారణమని అనుమానాలు బలపడుతున్నాయి. తాగునీరు కలుషితంపై హైదరాబాద్‌ కు చెందిన ఒక ప్రవేటు సంస్థ పరిశీలించింది.

ఏలూరులో వింత వ్యాధికి తాగునీరే కారణం

ప.గో.: ఏలూరులో వింత వ్యాధికి  కలుషిత తాగునీరే కారణమనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యాధికి గల కారణాలపై హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రవేటు సంస్థ పరిశీలించింది. అయితే ఈ పరిశీలనలో పలు విషయాలు వారి దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా ఈ వ్యాధి రావడానికి తాగునీరు కలుషితం అవ్వడం వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని సంస్థ చెప్పింది.  ఈ పరిశీలనలో తాగునీటిలో మిథైన్ డై క్లోరైడ్ (డీపీయం) ఉన్నట్లుగా గుర్తించింది.  పరిమితికి మించి  డీపీయం  ఎక్కువగా ఉందని ఆసంస్థ  తెలిపింది. అందుకే బాధితులకు మూర్ఛలక్షణాలు కనిపించి ఉండవచ్చని అభిప్రాయ పడింది.   పరిమితికి మించి ఎక్కవగా ఉన్న ప్రమాదకరం కాని ఇతర రసాయనాలు  ఉన్నాయని  తెలిపింది. అలాగే కేంద్ర త్రిసభ్య కమిటీ సభ్యులు  ఈరోజు ఓ నివేదికను ఇవ్వనున్నారు. యన్ ఐ యన్ సంస్థలు, సీసీయంబీ నివేదికలు రావడానికి మరో నాలుగు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. నివేదికల అధ్యయానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ వేశారు.  నేడు పూర్తి స్థాయిలో వింత వ్యాధికి గల కారణాలు  తెలిసే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - 2020-12-11T14:15:11+05:30 IST