కరోనా నియంత్రణపై చిత్తశుద్ధి లేదు: శైలజానాథ్
ABN , First Publish Date - 2020-04-08T09:46:13+05:30 IST
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, తీసుకుంటున్న అరకొర చర్యలే ఇందుకు నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు.

అనంతపురం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, తీసుకుంటున్న అరకొర చర్యలే ఇందుకు నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ వైర్‌సను ఎదుర్కోవడంలో ప్రభుత్వం శాస్ర్తీయంగా ముందుకు సాగడం లేదన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా పేదలు, కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికులకు ఉచితంగా రేషన్ అందించడంతో పాటు ప్రతి కుటుంబానికి రూ. 5 వేలు నగదు పంపిణీ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.