ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2020-08-12T14:04:45+05:30 IST
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద స్వల్పంగా గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది.

రాజమండ్రి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద స్వల్పంగా గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 10.15 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేసి... రెండు లక్షలు 25 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు 12,500 క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేశారు.