-
-
Home » Andhra Pradesh » Doing journalists for migrant workers
-
వలస కార్మికులకు జర్నలిస్టుల చేయూత
ABN , First Publish Date - 2020-05-18T19:31:54+05:30 IST
నగరం నుంచి వలస కూలీలను తరలించేందుకు ప్రత్యేక బస్సులు..

విజయనగరం: నగరం నుంచి వలస కూలీలను తరలించేందుకు ప్రత్యేక బస్సులు రెండు రోజులపాటు నడపాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా వెళ్లేందుకు వందలాదిగా వస్తున్న వసల కార్మికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. వలస కార్మికుల కష్టాలను తెలుసుకున్న విజయనగరంలో ఉన్న జర్నలిస్టులు ఇవాళ, రేపు వలస కార్మికులందరికీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. జర్నలిస్టులు తమ సొంత డబ్బులతో రవాణా సదుపాయంతోపాటు భోజనం, నీళ్లు ఏర్పాటు చేశారు. అలాగే దారి ఖర్చులకు కూడా డబ్బులు అందజేశారు.