సుధాకర్‌పై దాడికి నిరసనగా ఆనందబాబు మౌనదీక్ష

ABN , First Publish Date - 2020-05-17T22:23:16+05:30 IST

డాక్టర్ సుధాకర్‌పై దాడిని నిరసిస్తూ మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబు మౌనదీక్ష చేపట్టారు. దీక్షకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. సుధాకర్ పట్ల పోలీసుల తీరు హేయం అన్నారు.

సుధాకర్‌పై దాడికి నిరసనగా ఆనందబాబు మౌనదీక్ష

గుంటూరు: డాక్టర్ సుధాకర్‌పై దాడిని నిరసిస్తూ మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబు మౌనదీక్ష చేపట్టారు. దీక్షకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. సుధాకర్ పట్ల పోలీసుల తీరు హేయం అన్నారు. మాస్కులు అడగడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే సుధాకర్ చేసిన తప్పా? అని అని ప్రశ్నించారు. ఇది పోలీసుల దుశ్చర్య కాదని, ప్రభుత్వం చేయించిన అమానుష చర్య అని ధ్వజమెత్తారు. సుధాకర్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆనందబాబు డిమాండ్ చేశారు. సుధాకర్‌పై చేపట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలన్నారు.

Updated Date - 2020-05-17T22:23:16+05:30 IST