డాక్టర్‌ సుధాకర్‌ సస్పెన్షన్‌ను రద్దు చేయాలి: హెచ్‌ఆర్‌ఎఫ్‌

ABN , First Publish Date - 2020-04-12T07:24:14+05:30 IST

నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ఎనస్తీషియన్‌ డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని మానవ హక్కుల వేదిక...

డాక్టర్‌ సుధాకర్‌ సస్పెన్షన్‌ను రద్దు చేయాలి: హెచ్‌ఆర్‌ఎఫ్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ఎనస్తీషియన్‌ డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధ, విశాఖ జిల్లా అధ్యక్షుడు శరత్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఎన్‌-95 మాస్కులను అవసరమైనన్ని సరఫరా చేయడం లేదన్నందుకు డాక్టర్‌ను సస్పెండ్‌ చేయడం, పోలీస్‌ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. మాస్కుల కొరత విశాఖ జిల్లాలోనే కాక దేశవ్యాప్తంగా ఉందని, అందులో అవాస్తవం ఏమీలేదని వారు పేర్కొన్నారు.


Updated Date - 2020-04-12T07:24:14+05:30 IST