వైసీపీ నేతలకు ఉపమానాలు అర్థం కావా?

ABN , First Publish Date - 2020-12-30T08:25:14+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో తాను వాడిన ఉపమానాన్ని అర్థం చేసుకోలేని వైసీపీ నేతలను చూస్తే జాలిగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు.

వైసీపీ నేతలకు ఉపమానాలు అర్థం కావా?

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజం


అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో తాను వాడిన ఉపమానాన్ని అర్థం చేసుకోలేని వైసీపీ నేతలను చూస్తే జాలిగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. సెంటు స్థలంలో ఇల్లు పేదల భవిష్యత్తు అవసరాలకు సరిపోదన్న విషయాన్ని, సీఎం ఇంట్లో కుక్కల పెంపకానికి కూడా సెంటు సరిపోవడంలేదనే ఉపమానంతో తాను వ్యాఖ్యానిస్తే దానికి పెడర్థాలు తీయడం మంచిపద్ధతి కాదని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన హితవు పలికారు.  చంద్రబాబుకు సీపీఐని అమ్మేశారని మాట్లాడటం పెద్దిరెడ్డి దిగజారుడు రాజకీయమే అవుతుందన్నారు. చేతనైతే తన వ్యాఖ్యల్లో అర్థాన్ని గ్రహించి పేదలకు కేటాయిస్తున్న సెంటు స్థలాన్ని రెండు సెంట్లకు పెంచాలని నారాయణ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-12-30T08:25:14+05:30 IST