వారికి నిబంధనలు పట్టవా!

ABN , First Publish Date - 2020-05-08T11:14:20+05:30 IST

కృష్ణాజిల్లాలో తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ భౌతిక దూరం, పరిశుభ్రత పాటించాలని నియోజకవర్గ ప్రజలకు అవగాహన కలిగించాల్సిన ఎమ్మెల్యే వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో..

వారికి నిబంధనలు పట్టవా!

భౌతికదూరం పాటించని అధికార పార్టీ నేతలు


కంచికచర్ల రూరల్‌, మే 7: కృష్ణాజిల్లాలో తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ భౌతిక దూరం, పరిశుభ్రత పాటించాలని నియోజకవర్గ ప్రజలకు అవగాహన కలిగించాల్సిన ఎమ్మెల్యే వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మాత్రం నిబంధనలు విస్మరించారు. కనీస జాగ్రత్తలు పాటించకుండానే ప్రమాణ స్వీకారోత్సవ తంతు ముగించారు. కంచికచర్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో గురువారం పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు సమక్షంలోనే భౌతిక దూరాన్ని విస్మరించి కార్యక్రమం నిర్వహించటం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రమాణ స్వీకారాలేమో కానీ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందితే పరిస్థితేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2020-05-08T11:14:20+05:30 IST