సెల్‌ఫోన్‌కే పరిమితం చేయొద్దు

ABN , First Publish Date - 2020-07-19T08:49:22+05:30 IST

‘ఆన్‌లైన్‌ విద్యని పూర్తిగా సెల్‌ఫోన్‌ లేదా ట్యాబ్‌లకు పరిమితం చేయకుండా భౌతిక అభ్యసన ప్రక్రియను జోడించాలి. అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు, ఇంట్లో లభించే

సెల్‌ఫోన్‌కే పరిమితం చేయొద్దు

  • భౌతిక అభ్యసన ప్రక్రియను జోడించాలి
  • అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు చేయించాలి
  • ఆన్‌లైన్‌ విద్యపై పాఠశాల విద్య రెగ్యులేటరీ కమిషన్‌ సిఫారసు


అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): ‘ఆన్‌లైన్‌ విద్యని పూర్తిగా సెల్‌ఫోన్‌ లేదా ట్యాబ్‌లకు పరిమితం చేయకుండా భౌతిక అభ్యసన ప్రక్రియను జోడించాలి. అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు, ఇంట్లో లభించే వస్తువులతో విద్యార్థులతో ప్రయోగాలు చేయించాలి. మొబైల్‌ ల్యాబరేటరీలు ఏర్పాటుచేయాలి’ అని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ స్పష్టం చేసింది. కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించే అవకాశాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాల్సి వస్తే తలెత్తే ఇబ్బందుల గురించి శనివారం కమిషన్‌ చర్చించింది. కమిషన్‌ చైర్మన్‌ ఆర్‌.కాంతారావు అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ విజయశారదారెడ్డి, సెక్రెటరీ ఆలూరు సాంబశివారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. ఐదో తరగతిలోపు పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు రద్దుచేస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే దీనివల్ల డ్రాపౌట్లు పెరిగే అవకాశం ఉందని సభ్యులు హెచ్చరించారు. ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులలో ఎవరో ఒకరు విధిగా పిల్లల దగ్గర ఉండేలా తల్లిదండ్రులలో చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-07-19T08:49:22+05:30 IST