ట్యూషన్‌ ఫీజు పెంచొద్దు!

ABN , First Publish Date - 2020-08-01T09:41:58+05:30 IST

పలుమార్లు హెచ్చరించినప్పటికీ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థలు తమ తీరు మార్చుకోవడం లేదని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌

ట్యూషన్‌ ఫీజు పెంచొద్దు!

ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలపై  పాఠశాల విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఫైర్‌


అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): పలుమార్లు హెచ్చరించినప్పటికీ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థలు తమ తీరు మార్చుకోవడం లేదని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌.కాంతారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు, టీచర్లకు జీతాలు చెల్లించే విషయంలో కమిషన్‌, ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు ఇచ్చాయని, అయినా కొన్ని పాఠశాలల తీరు మారడం లేదని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.   ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు గత ఏడాది ఉన్న ట్యూషన్‌ ఫీజు మాత్రమే కట్టించుకోవాలన్నారు. మార్చి నుంచి ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని మౌఖిక ఆదేశాలతో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు, జీతాలు కూడా ఇవ్వడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, తక్షణమే సిబ్బందికి జీతాలు అందించాలని, తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు.  విద్యార్థులు,  ఉపాధ్యాయులు తమ సమస్యలను 9150381111కు ఫోన్‌ ద్వారా, apse-r-m-c2020@-g-ma-i-l.-co-m కు ఈ-మెయిల్‌ ద్వారా, www.apserm.ap.gov.in పోర్టల్‌లో గ్రీవెన్స్‌ అనే లింక్‌ ద్వారా తెలపవచ్చని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-08-01T09:41:58+05:30 IST