ప్రైవేట్‌ టీచర్లపై అడ్మిషన్ల భారం వద్దు

ABN , First Publish Date - 2020-06-25T07:35:06+05:30 IST

ప్రైవేట్‌ పాఠశాలలు, కాలేజీలు అడ్మిషన్ల పేరుతో తమ ఉపాధ్యాయులను విద్యార్థుల ఇళ్లకు పంపడం మానుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ..

ప్రైవేట్‌ టీచర్లపై అడ్మిషన్ల భారం వద్దు

జీతాన్ని అడ్మిషన్లతో ముడిపెట్టి వేధించరాదు

 విద్యా నియంత్రణ మండలి హెచ్చరిక


అమరావతి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ పాఠశాలలు, కాలేజీలు అడ్మిషన్ల పేరుతో తమ ఉపాధ్యాయులను విద్యార్థుల ఇళ్లకు పంపడం మానుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య నియంత్ర ణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌.కాంతారావు హెచ్చరించారు. పైగా వారి జీతాన్ని అడ్మిషన్లతో ముడిపెట్టి వేధించడం తగదని హితవు పలికారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే సంబంధిత స్కూళ్లు, కాలేజీల గుర్తింపు రద్దుచేసేలా కమిషన్‌ చర్యలు తీసుకుంటుందని చైర్మన్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ విద్యా సంస్థలోనైనా ఇలాంటివి మళ్లీ జరిగితే ్చఞట్ఛటఝఛి.్చఞ.జౌఠి.జీుఽ  పోర్టల్‌ లో తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తమ సిఫారసులను ప్రభుత్వానికి నివేదించారు. ప్రైవేట్‌ విద్యా సంస్థలపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో సభ్యులతో కలిసి ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.ఫీజులు చెల్లించలేదన్న నెపంతో కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు టీసీలు మంజూరు చేయడం లేదని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేదిలేదని కమిషన్‌ సభ్యులు తీర్మానించారు. 


ప్రభుత్వానికి సూచనలు!

ప్రైవేట్‌ పాఠశాలల గుర్తింపు, రెన్యువల్‌కు సంబంధించిన జీ.వో 1ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సీబీఎస్సీ నిబంధనలను పరిగణనలోనికి తీసుకోవాలి. ప్రస్తుతం టీవీ మాధ్యమం ద్వారా ప్రసారం చేస్తోన్న పాఠాలలో స్పోకెన్‌ ఇంగ్లీష్‌ కూడా చేర్చాలి. తద్వారా విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్న ఇంగ్లీషుమీడియంకు అలవాటు పడతారు.


ఆ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌ ఉండదు!

జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన సాయాన్ని ప్రభుత్వం కొన్ని కేటగిరీల అడ్మిషన్లకే వర్తింపజేయాలని నిర్ణయించింది. సింగిల్‌ విండో -2, 3లలో నమోదు చేసుకున్న కాలేజీలకు ఆయా పథకాల కింద ఇప్పటి వరకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇకపై వర్తింపజేయరాదని నిర్ణయిస్తూ.. మార్చి 23న జారీచేసిన జీవో 14కు సవరణలతో ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌ చంద్ర ఉత్తర్వులు జారీచేశారు. 

Updated Date - 2020-06-25T07:35:06+05:30 IST