మే మొదటివారంలో అల్పపీడనం..!
ABN , First Publish Date - 2020-04-26T19:29:13+05:30 IST
ఆగ్నేయ బంగాళాఖాతంలో మే మొదటివారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. దీని ఫలితంగా కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో మే మొదటివారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. దీని ఫలితంగా కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, రాగల 48 గంటలు రాయలసీమలో 41°C-43°C అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.