సచివాలయాల్లో డిజిటల్‌ బోర్డులు

ABN , First Publish Date - 2020-08-11T08:52:28+05:30 IST

గ్రామ/వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ బోర్డులు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

సచివాలయాల్లో డిజిటల్‌ బోర్డులు

అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): గ్రామ/వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ బోర్డులు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి మార్గదర్శకాలను బోర్డుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. సోమవారమిక్కడ తాడేపల్లిలో సీఎం సమీక్ష నిర్వహించారు. అన్ని సచివాలయాల్లో మరుగుదొడ్లు ఏర్పాటుచేయాలన్నారు. సచివాలయాలకు భవన నిర్మాణాలపై దృష్టి సారించాలని సూచించారు. వీటిలో ఉన్న ఖాళీలకు సెప్టెంబరులోగా పరీక్షల ప్రక్రియ ముగించాలన్నారు. సచివాలయాల్లో నిర్దేశిత సమయంలోగా విజ్ఞప్తుల పరిష్కారంపై పర్యవేక్షించేందుకు పర్సుయేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ)ను సీఎం ప్రారంభించారు. దీనిద్వారా దరఖాస్తు ఎక్కడ ఆగినా ఎప్పటికప్పుడు అధికారులు సచివాలయాల సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. మొదటగా నాలుగు సర్వీసులు, అక్టోబరు నుంచి 543కి పైగా సేవల అమలును పీఎంయూ పర్యవేక్షించనుంది.

Updated Date - 2020-08-11T08:52:28+05:30 IST