సీఎం స్థాయి వ్యక్తి కులాల గురించి మాట్లాడటం నీచం: ధూళిపాళ్ల నరేంద్ర
ABN , First Publish Date - 2020-03-16T18:59:27+05:30 IST
అమరావతి: ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌కు కులాన్ని ఆపాదించడం దురదృష్టకరమని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు.
అమరావతి: ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌కు కులాన్ని ఆపాదించడం దురదృష్టకరమని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. రాజకీయ వికృత క్రీడకు సీఎం జగన్‌కు కులాలు అవసరం లేదన్నారు. ఇటీవల మీ పార్టీలో చేర్చుకున్న వంశీ, కరణం బలరాంది ఏ కులమని ధూళిపాళ్ల ప్రశ్నించారు. నిమ్మగడ్డ ప్రసాద్‌ది, పీవీపీది ఏ కులం? వాళ్ల పెట్టుబడులే మీకు కావాలి కదా అని ఎద్దేవా చేశారు. సీఎం స్థాయి వ్యక్తి కులాల గురించి మాట్లాడటం నీచమని మండిపడ్డారు.
ఇవే కులాలు ఉండాలని అసెంబ్లీలో చట్టం తెచ్చుకోండన్నారు. సీఎం స్థాయి వ్యక్తి కుల రహితంగా ఉండాలని ధూళిపాళ్ల నరేంద్ర హితవు పలికారు. సుపరిపాలన చేయాలని ప్రజలు మీకు 151 సీట్లు ఇచ్చారని.. దోపిడీలు, దౌర్జన్యాలు చేయాలని మీకు అన్ని సీట్లు ఇవ్వలేదన్నారు. ఎన్నికలు వాయిదా వేయగానే జగన్ ఏదో జరిగినట్లు మాట్లాడుతున్నారన్నారు. జగన్ ధర్మం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. వైసీపీ నేతలు.. మహిళలు, బీసీలని చూడకుండా దౌర్జన్యాలు చేశారన్నారు. జగన్ రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.